America: అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్..! 8 d ago
అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ ను అధికారికంగా ప్రకటించారు. ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పక్షి అమెరికా అధికారం, శక్తికి 242 ఏళ్లుగా ప్రతీకగా నిలుస్తుంది. అమెరికా అధికారిక చిహ్నంపై బాల్డ్ ఈగల్ చిత్రాన్ని 1782 నుంచి వినియోగిస్తున్నారు. ఆ ఏడాది నుంచే బాల్డ్ ఈగల్ను అమెరికా అధికార చిహ్నంగా గుర్తించింది. అప్పటి నుంచే ఆ చిహ్నం అధికార పత్రాలు, అధ్యక్ష పతాకం, కరెన్సీలపై ప్రతిబింబిస్తోంది. అయితే ఆ పక్షిని ఇప్పటి వరకూ అధికారికంగా జాతీయ పక్షిగా ప్రకటించలేదు. తాజాగా అధ్యక్షుడి ఆమోద ముద్రతో బాల్డ్ ఈగల్ అమెరికా జాతీయ పక్షిగా గుర్తింపు పొందింది.